‘ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో వందల కోట్లకు టికెట్లు అమ్ముకున్న బ్రోకర్.. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రజలకు మాయమాటలు చెబుతూ జోకర్లా వ్యవహరిస్తున్నడు.. వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలన్న వ్యక్తి ఉచిత విద్యుత్‌పై మాట్లాడడం హాస్యాస్పదం..’ అని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం పాలకుర్తిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ భూకబ్జాలకు పాల్పడే రేవంత్‌రెడ్డి తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఓటుతో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
పాలకుర్తి రూరల్, నవంబర్ 9: టీ-పీసీసీ అధ్యక్షుడు ఓ పెద్ద బ్రోకర్.. జోకర్ అని రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్ చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిని రేటెంతరెడ్డి అని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సీట్లను వందల కోట్లకు అమ్ముకున్న చరిత్ర రేవంత్‌రెడ్డిదని ధ్వజమెత్తారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర వందల కోట్లు వసూలు చేశాడని, సొంత పార్టీ నేతలే విమర్శించడం సిగ్గు చేటన్నారు. రేవంత్‌రెడ్డి ఐటం సాంగ్ గాలిపటమన్నారు. రేవంత్‌రెడ్డి బతుకు బ్లాక్మెయిల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే రేవంత్‌రెడ్డి నైజమన్నారు. భూ కబ్జాలు చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో ఓడిపోయిన వ్యక్తి పాలకుర్తిలో మాట్లాడడం సిగ్గు చేటన్నారు. రేవంత్‌రెడ్డి బ్రోకర్, జోకర్ మాటలు పాలకుర్తి ప్రజలు నమ్మారన్నారు. హెలికాప్టర్లో వచ్చే బతుకా నీది అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పెద్ద దొంగ అన్నారు. బాబ్లీ కోసం నేను టీడీపీ ఎమ్మెల్యేలు పోరాటం చేసి జైలుకు వెళ్తే రేవంత్‌రెడ్డి తప్పించుకుని పారిపోయాడన్నారు. దెబ్బ లు సైతం తిన్నామని, కేసుల పాలయ్యామన్నారు. తెలంగాణ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రేవంత్‌రెడ్డి బాబు చెప్పిన మాటలు విని పారిపోయాడని చెప్పారు. రేవంత్‌రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి చరిత్ర నాకు బాగా తెలుసన్నారు.
అతడికి వందల ఎకరాల ఆస్తి ఉందన్నారు. 250 ఎకరాల భూమిని రామకృష్ణ మఠానికి అప్పగించానన్నారు. తన గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబ చరిత్ర తనకు తెలుసన్నారు. వాల్ పెయింటర్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించావని ఎర్రబెల్లి ప్రశ్నించారు. తాను మచ్చలేని మనిషినన్నారు. రేవంత్‌రెడ్డికి తన గురించే మాట్లాడే అర్హత లేదన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న దొంగ రేవంత్‌రెడ్డి అన్నారు. అతను తప్పు చేసి తనపై మాట్లాడడం తగదన్నారు. ఓటుకు నోటు కేసుకు తనకు సంబంధం లేదన్నారు. నేను ప్రజల మద్దతుతో ఏడు సార్లు గెలిచానని, కాంగ్రెస్, బీఆర్ఎస్ గాలిలో కూడా గెలిచిన వ్యక్తినన్నారు. సీఎం కేసీఆర్ తర్వాత వరుసగా గెలిచిన ఎమ్మెల్యేనన్నారు. పాలకుర్తి ప్రజలు తనను మరోసారి గెలిపిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి మాయమాటలను పాలకుర్తి ప్రజలు నమ్మరన్నారు. రేవంత్‌లాగా కొడంగల్‌లో ఓడిపోలేదన్నారు. కొడంగల్‌తో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నా రేవంత్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కరెంట్ విషయంలో మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అమెరికాకు వెళ్లి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్‌రెడ్డి పాలకుర్తికి వచ్చి 24 గంటల కరెంట్ ఇస్తామనడం సిగ్గు చేటన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఐదు గంటల కరెంట్ చాలన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో 24గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో మూడు గంట లు, ఛత్తీస్‌గఢ్‌లో 6 గంటలు, రాజస్థాన్‌లో 7 గంటల కరెంట్ ఇస్తున్నారన్నారు. విద్యుత్‌పై మాట్లాడడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గు ఉండాలన్నారు. కాంగ్రెస్ సభలో పాలకుర్తి ప్రజలను రేవంత్‌రెడ్డి కాలుతో తన్నడం బలుపా అని మండిపడ్డారు. వీరులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో పాలకుర్తి ప్రజలు ఓటుతో రేవంత్‌రెడ్డిని తన్ని తరిమికొట్టాలన్నారు.
పాలకుర్తికి పౌరసత్వం లేని అత్త…వారసత్వం లేని కోడలు దొరికారని వారిని పాలకుర్తి ప్రజలు చిత్తుగా ఓడిస్తారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. ఝాన్సీరెడ్డి పెద్ద మోసకారి అన్నారు. పౌరసత్వం లేకుండా పాలకుర్తి ప్రజలను మోసం చేయాలని చూసిందన్నారు. ఆబద్ధ్దాలు ఆడుతూ పాలకుర్తి ప్రజల జీవితాలతో చెలగాటాలాడాలని చూస్తోందన్నారు. ఝాన్సీరెడ్డి ఆమె కోడలు యశస్వినీ రెడ్డి ఓడిపోవడం.. అమెరికాకు వెళ్లిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. యశస్విని రెడ్డికి పాలకుర్తికి ఏం సంబంధమని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ అమెరికా కోడలు మాత్రమేనన్నారు. రేవంత్‌రెడ్డి పెద్ద గజదొంగ అని మండిపడ్డారు. రూ.100 కోట్లకు ఎమ్మెల్యేల సీట్లు అమ్ముకున్నాడన్నారు. తనతో పాటు మానవతారాయ్, జనార్దన్‌రెడ్డి, చిన్నారెడ్డి, సోమశేఖర్‌రెడ్డితో పాటు ఎంతోమందిని ఊచకోత కోశాడని ధ్వజమెత్తారు. పాలకుర్తి సీటును ఝాన్సీరెడ్డికి రూ.10 కోట్లకు అమ్ముకున్నాడన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం ఖావడం ఓ కల మాత్రమేనన్నారు. పాలమూరోడికి పాలకుర్తి పౌరుషం చూపిస్తామన్నారు., పాలకుర్తి ప్రజలను తన్మిన రేవంత్‌రెడ్డిని తన్ని తరిమికొడతామన్నారు. ప్రజల మనిషి ఎర్రబెల్లి దయాకర్‌రావును 60 వేల నుంచి 70 వేల మెజారిటీతో గెలిపిస్తామన్నారు.
జనగామ, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దురుసువైఖరి మరోసారి బయటపడ్డది. వేదిక మెట్లపై తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను బూటుకాలితో త న్నుతూ కిందకి దిగుతూ తన అహంకారాన్ని ప్రదర్శించారు. పైగా కార్యకర్తలను ‘లం.. కొడుకులు’ అంటూ పరుష పదజాలంతో తిట్టడంపై హస్తం శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సభలో తాను మాట్లాడుతుండగా జిందాబాద్‌లతో అడ్డుతగిలిన ప్రజలను సైతం ఏకవచనంతో సంబోధిస్తూ అసహనం వ్యక్తం చేశారు. సభ ముగిసిన తర్వాత వేదిక మెట్ల నుంచి కిందకు దిగుతుండగా కొందరు కార్యకర్తలు ఆయనను కలిసే ప్రయత్నం చేశార. దీంతో వారిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన రేవంత్‌రెడ్డి, బూతులు తిడుతూ కాళ్లతో పలుమార్లు తన్నుతూ కిందకి దిగారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్‌రెడ్డి తీరుపై పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాపార్టీ తెలుగుదేశానికి ఏజెంట్‌గా తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి, తెలంగాణ బిడ్డలపై ప్రదర్శించిన అహంకారాన్ని పాలకుర్తి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నోఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కా ర్యకర్తలను కాలితో తన్నుతారా?ఇంత బలుపా? ఇంత కండకావరమా? అధికారం లేకుండానే ఇ లా రెచ్చిపోతే..తప్పిదారి అధికారం అప్పగిస్తే రౌ డీల రాజ్యం, రాక్షస పాలన రాదా? అం టూ మండిపడుతున్నారు.‘తెలంగాణ బిడ్డలను కాలి తో తన్ని అవమానిస్తాడా? ఇదేం పార్టీ? ఆయనేం నాయకుడు?’ అంటూ పార్టీ సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.