కాంగ్రెస్ వలస పక్షులను నమ్మొద్దు
ఎన్నికలు రావడంతో అధికారం కోసం కాంగ్రెస్ నేతలు వలస పక్షులను ఇక్కడికి పంపారని, వారి మాటలను ప్రజలు న మ్మొద్దని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
- సీఎం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి
- పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు నా కుటుంబ సభ్యులు
- అందరి ఆత్మీయత, ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలుస్తా
- ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు, నవంబర్ 27 : ఎన్నికలు రావడంతో అధికారం కోసం కాంగ్రెస్ నేతలు వలస పక్షులను ఇక్కడికి పంపారని, వారి మాటలను ప్రజలు న మ్మొద్దని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని సోమారం, జమస్థాన్పురం, మడిపల్లి గ్రామాల్లో అశేష ప్రజానీకం మధ్య ఎర్రబెల్లి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల కష్టసు ఖాల్లో, కరోనా విపతర సమయంలో అండగా ఉన్నాను.. ఈ ఎన్నికల్లో త నకు తోడుగా ఉండి ఆశీర్వదించాలని కోరారు.
పాలకుర్తి నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించామని, ఆలయాలను అభివృద్ధి చేశామన్నారు. 60 ఏళ్లు దేశం, రాష్ర్టాన్ని కాంగ్రెస్ పాలించినా కరెంటు సరిగా ఉండేది కాదని, ప్రజలు తాగు, సాగునీటి సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదిన్నరేళ్లలో 24 గంటలు కరెంటు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, పంటలకు సాగు నీరందించామన్నారు. ప్రాజెక్టులతో పాటు అనేక చెక్‌డ్యాములు నిర్మించామని చెపారు. తన జీవితం లో ఎక్కువ భాగం కుటుంబ సభ్యుల కంటే జనం మధ్యనే గడిపానని, నియోజకవర్గంలోని ప్రజలు తనను దయన్నఅని ఆప్యాయంగా పిలుచుకుంటారని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఇప్పుడు తనపై పోటీ చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వలస పక్షి అని, ప్రజలకు వారు తెలియరని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో వారు అబద్దాలు చెబుతున్నారని, ప్రజలు వాస్తవాలు గమనించి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్‌రావు మాట్లాడుతూ.. దయాకర్‌రావు నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందజేశారని, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని కోరారు.
రెడ్డి కులస్తులకు అండగా నిలుస్తా…
తొర్రూరు పట్టణంలోని ఎల్వైఆర్ గార్డెన్లో సో మవారం నిర్వహించిన రెడ్డి కులస్తుల ఆత్మీయ స మ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఏ ఒకరికి అన్యాయం చేయలేదన్నారు. తన దగ్గరకు వచ్చే పోలీసు కేసులైనా, భూ వివాదాలకు సంబంధించిన అంశాల్ల్లో ఎవరి వైపు న్యాయం ఉంటే వారి పక్షాన నిలబడాలని అధికారులకు సూచిస్తానని తెలిపారు. గత ఎన్నికల్లో జంగా రాఘవరెడ్డి పోటీ చేసినా రెడ్డి కులస్తులంతా తనకే మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. రెడ్డి కులస్తులు ఎకువ శాతం వ్యవసాయ ఆధారిత పనులే చేస్తారని,
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. తొర్రూరులో ఎకరం స్థలంలో ఫంక్షన్ హాల్ కట్టిస్తామని, అర్హులైన వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి సామాజిక వర్గంలోని యువతీ యువకులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే భాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ ఎన్నిక్లలో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

