పెద్దికేం కాదు.. అధైర్యపడొద్దు
తెలంగాణ ఉద్యమనేతగా పెద్ది ప్రజల మనిషని, వారి మనస్సులో ఉన్న ఆయనకేం కాదు, అధైర్యపడొద్దని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్నకు ధైర్యం చెప్పారు.
- హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్
దేవరుప్పుల/హనుమకొండ, జూలై 30 : తెలంగాణ ఉద్యమనేతగా పెద్ది ప్రజల మనిషని, వారి మనస్సులో ఉన్న ఆయనకేం కాదు, అధైర్యపడొద్దని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్నకు ధైర్యం చెప్పారు. యశోదా దవాఖానలో ఐసీయూలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డిని గురువారం ఉదయం చూసిన వీరు ఆయన ఆరోగ్య స్థితిపై వైద్యులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి భార్య స్వప్నను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
తెలంగాణ ఉద్యమనేతగా ప్రజల మనసులు చూరగొన్న పెద్దిలాంటి వారికి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని, వైద్యులు తమ శక్తి వంచన లేకుండాప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులు, నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడారు. మెదడు స్పందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కేతిరి వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

