న్యూఢిల్లీ : బీహార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాశ్ కొనసాగింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరునెలలు దాటినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అతను ఎన్నిక కాకపోయినా మంత్రిగా కొనసాగించడంపై వివరణ ఇవ్వాలని బీహార్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 2025 నవంబర్‌లో తొలుత నితీశ్ కుమార్ క్యాబినెట్లో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా దీపక్ బాధ్యతలు చేపట్టి 2026 ఏప్రిల్ 25 వరకు కొనసాగారు.
ఆ తర్వాత నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో క్యాబినెట్ మొత్తం రద్దయింది. తర్వాత సమ్రాట్ చౌదరి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు మళ్లీ దీపక్ మంత్రిగా ప్రమాణం చేశారు. చట్టపరంగా ఏ మంత్రి అయినా ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలి.