న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 21 మంది పోలీసులు సహా 22 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఇదే కేసుకు సంబంధించి అప్పటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షాను నిర్దోషిగా విడిచిపెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్ను విచారించడానికి తిరస్కరించింది.
ఈ కేసులో 92 మంది సాక్షులు ప్రతికూలంగా మారడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. 22 మందిని విడిచిపెడుతూ బాంబే హైకోర్టు నిరుడు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మృతుడు సోదరుడు రుబాబుద్దీన్ షేక్ సుప్రీంను ఆశ్రయించారు.