దుబాయ్: ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి శ్రీచరణి ఆల్‌టైం రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తూ టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరిన ఆమె.. తాజాగా రేటింగ్ పాయింట్ల విషయంలోనూ 817 పాయింట్లతో సరికొత్త రికార్డును సృష్టించింది.
ఆస్ట్రేలియా పేసర్ మేగన్ షట్ 2018లో 806 రేటింగ్ పాయింట్లు సాధించడమే ఇప్పటిదాకా అత్యుత్తమం. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఆసియా కప్‌తో పాటు ఆసియా క్రీడల్లో రాణించిన చరణి.. తన ర్యాంకుతో పాటు రేటింగ్ పాయింట్లనూ మెరుగుపరుచుకుని జట్టులోకి వచ్చిన ఏడాదికాలానికే కెరీర్ బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకోవడం విశేషం.