AP News | నిత్యావసరాల ధరలు పెంచి విజన్ కబుర్లు ఎందుకు.. కూటమి సర్కారుపై వైసీపీ ఫైర్..!
AP News | ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ‘విజన్ 2050’ పై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆరోపించింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే చంద్రబాబు విజన్ 2050 గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
AP News : ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ‘విజన్ 2050’ పై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆరోపించింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే చంద్రబాబు విజన్ 2050 గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రస్తుత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళికల పేరిట ప్రచారం చేస్తున్నారని ధర్మాన ఆరోపించారు. రాష్ట్రంలో సామాన్యుడి కొనుగోలు శక్తి ఘోరంగా పడిపోయిందని, ప్రజల జీవనం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని పేర్కొన్నారు. 2024 నాటి ధరలతో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసరాలు, ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయని ధర్మాన అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్య ప్రజలపై తీవ్ర భారాన్ని మోపిందని చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ప్రభుత్వం.. బిజినెస్ సమ్మిట్ల పేరుతో విలువైన భూములను చౌకగా ఇతరులకు కట్టబెడుతోందని ధర్మాన విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఇలాంటి విధానాలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు మాజీ సీఎం జగన్ కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ స్పేసెస్‌లో అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- AP News
- chandra babu
- ys jagan
- ysrcp
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | నిత్యావసరాల ధరలు పెంచి విజన్ కబుర్లు ఎందుకు.. కూటమి సర్కారుపై వైసీపీ ఫైర్..!
Nigerian tourist | ఎన్టీఆర్ బీచ్‌లో నైజీరియా పర్యాటకుడు మృతి..మరో ఐదుగురు సురక్షితం
Nitin Gadkari | అవన్నీ తప్పుడు కథనాలు, నేను పనిచేస్తూనే ఉంటా.. రిటైర్మెంట్ వార్తలపై నితిన్ గడ్కరీ..!
Suriya | హోంబలే ఫిలిమ్స్ నయా ప్రాజెక్ట్.. సూర్య రోల్ ఏంటో తెలిసిపోయింది.. !
Puvwada Ajay Kumar | వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవాలి: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు

