హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తేతెలంగాణ): సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు జోక్యాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నారాయణ పేర్కొన్నారు. సోహ్రాబుద్దీన్ షేక్‌తో పాటు ఆయన భార్య కౌసర్ బీ వరుసగా జరిగిన ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ఈ కేసుల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని, విచారణ చేపడుతున్న న్యాయమూర్తులకు ప్రత్యేక భద్రత, రక్షణ కల్పించాలని ఆయన కోరారు.