న్యూఢిల్లీ : భారత్ సరిహద్దును ఆనుకుని ఉన్న తన వైమానిక స్థావరాలలో చైనా 12 జె-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించింది. వాణిజ్య ఉపగ్రహసంస్థ వాంటోర్ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎల్వోసీ వెంబడి ఇంత భారీగా ఫైటర్ జెట్లను చైనా మోహరించడం ఇదే మొదటిసారి.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ జిన్ జాంగ్యాన్లోని హోటన్ వైమానిక స్థావరంలో 8, టిబెట్‌లోని డామ్క్సుంగ్ వైమానిక స్థావరంలో 4 ఫైటర్ జెట్లను మోహరింపజేసినట్టు ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. చైనా ఆయుధాలలో జే-20 విమానాలు అత్యంత పవర్ ఫుల్ క్యాటగిరీలో ఉన్నాయి.