హనుమకొండ, ఆగస్టు 10 : హనుమకొండ రాంనగరలోని మంత్రి కొండ సురేఖ(Konda Surekha )ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్నాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal ) అక్షయపాత్రకు ఇన్వొద్దని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. ఇంటిలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేశారు. నెలకు వేతనం ఇస్తానని చెప్పిన రేవంత్రెడ్డి మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడం చాలా బాధకరం అన్నారు.
ఓట్లకోసం మధ్యాహ్న భోజన కార్మికులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందిన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళగా మంత్రి సాటి మహిళల సమస్యలను అర్థం చేసుకొంటుందని, మా సమస్యను మంత్రికి వివరిద్దామని ఇంటివద్దకు వెళ్తే.. పోలీసులను పెట్టి అరెస్టు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఎలాంటి జీతాలు లేకున్న విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా అప్పులు తెచ్చి వండిపెట్టామని, ఇప్పుడు మాకు జీవనాధారం లేకుండా పొట్టను కొట్టారాని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖిరి నశించాలని, సీఐటీయూ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిన మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు.
మంత్రి కొండా సురేఖ ఇల్లు ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు
మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని కార్మికుల ఆగ్రహం
మధ్యాహ్న భోజన బాధ్యతలు అక్షయపాత్ర సంస్థకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు
నిరసన… pic.twitter.com/4fHFFWcslX
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2025