హనుమకొండ, అక్టోబర్ 21: జాతీయ సాంకేతిక విద్యా సంస్థ వరంగల్ నిట్లో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, సమగ్ర విద్యను ప్రోత్సహించేందుకు ‘మానసిక ఆరోగ్య-వెల్నెస్ కేంద్రం’ ప్రారంభించారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఆత్మీయమైన, మానసిక సమతుల్యతతో కూడిన వాతావరణాన్ని కల్పించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. జాతీయ విద్యా విధానం ఆవిష్కరించిన సమగ్ర అభివృద్ధి దిశగా మరో ముందడుగుగా నిలిచిందని, 2024 ఫిబ్రవరి 9న హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, కన్హా శాంతి వనం (హైదరాబాద్)తో ఒప్పందం కుదుర్చుకోవడంతో ప్రారంభమైందన్నారు.
ధ్యానం, యోగాభ్యాసం, మానసిక ఒత్తిడి నియంత్రణ వంటి పద్ధతులను విద్యార్థులు, అధ్యాపకుల దైనందిన జీవితంలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ధ్యానం, ఒత్తిడి నివారణ శిక్షణలు, అధ్యాపకుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మే 5, 2025న హార్ట్ ఫుల్నెస్తో ఒప్పందం మరో మూడు సంవత్సరాలకు పునరుద్ధరించబడిందని, తద్వారా ఈ మానసిక వెల్నెస్ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగనున్నట్లు తెలిపారు.