హనుమకొండ, సెప్టెంబర్ 17: హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వి రామచంద్రం బుధవారం కాలేజీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ రాష్ర్టంలోని వివిధ కంపెనీలు కాలేజీకి వచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి మాట్లాడుతూ కాలేజీలోని ప్లేస్మెంట్ సెల్, ఫిజిక్స్ విభాగం సహకారంతో ఉద్యోగ కల్పన కార్యక్రమాలను చేపడుతుం దన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఉపాధి కల్పన కేంద్రం డైరెక్టర్ జితేందర్, ఫిజిక్స్విభాగం అధ్యక్షుడు వరలక్ష్మి, నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు సందీప్‌కుమార్, సతీష్, అధ్యాపకులు పాల్గొన్నారు.