నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 17 ;సమైక్యపాలన నాటి కష్టాల నుంచి గట్టెక్కి స్వరాష్ట్రంలో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్న వేళ మూడు గంటలు చాలంటూ ‘కరెంటు కుట్రలు’ సృష్టించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై రైతులు కదంతొక్కారు. దండుగ అనుకున్న వ్యవసాయం 24గంటల నిరంతర విద్యుత్, పుష్కలంగా సాగునీటితో పండుగలా మారి, రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతన్న కడుపు కొట్టేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉచిత వైద్యుత్పై కాంగ్రెస్ వైఖరి, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించగా ఎక్కడికక్కడ మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలం ముత్తారం, పాలకుర్తిలో జరిగిన రైతుసభల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని సమైక్యరాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేసి రైతులను అరిగోస పెట్టిన పాపం కాంగ్రెస్‌దేనని మండిపడ్డారు. ఉచిత కరంటు వద్దన్న కాంగ్రెస్‌ను ఖతం చేయాలని రైతులకు పిలుపునిచ్చిన ఆయన.. వెంటనే రేవంత్ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే నల్లబెల్లి, దుగ్గొండిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్‌లోని కొత్తపేటలో జరిగిన రైతుసభలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి, ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మహబూబాబాద్‌లోని ఏటిగడ్డతండా, కేసముద్రం, గూడురులో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, భూపాలపల్లి మండలంలోని నేరేడుపల్లిలో జడ్పీవైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, గోవిందరావుపేటలో జరిగిన రైతుసభలో రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పాల్గొన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం కేసీఆర్ సర్కారు చేస్తున్న కృషిని వివరించిన ప్రజాప్రతినిధులు.. ‘24గంటల ఉచిత విద్యుత్‌తో మూడు పంటల బీఆర్ఎస్ కావాలా?, ‘మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా?’ అని రైతులను కోరగా నిరంతర విద్యుత్ ఇచ్చే కేసీఆర్ సర్కారే కావాలంటూ జైకొట్టారు. వ్యవసాయానికి ‘మూడు గంటల కరెంటు’ చాలన్న రేవంత్‌రెడ్డిది నాలుకా.. తాటిమట్టా అని ఆగ్రహం వ్యక్తంచేసిన రైతులు.. అన్నదాతల జీవితాలను ఆగం చేసే ఇలాంటి నాయకులను తరిమికొట్టాలని ముక్తకంఠంతో నినదించారు. ఇలా తొలిరోజు అన్ని జిల్లాల్లో రైతుసభలు విజయవంతంగా జరుగగా, అన్నిచోట్లా కాంగ్రెస్ తీరుపై నిప్పులుచెరిగారు.
రేవంత్‌రెడ్డిది నాలుకా.. తాటిమట్టా?
ఎకరానికి గంట, మూడెకరాలకు మూడు గంటల కరంటు చాలని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డిది నాలుకా అది తాటి మట్టనా?. ఇదివరకు కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక లోవోల్టేజీ సరఫరాతో పంటలు పండక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ఇల్లు విడిచి రాత్రిపూట బాయిల కాడనే కరంట్ కోసం కావల పడుకున్నం. అయినా దొయ్య పారకపాయె. దోసిలి నిండకపాయె. ఇయ్యాల ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పుణ్యమా అని 24గంటల కరంట్ ఫుల్లుగా వత్తాంది. అట్లనే పుష్కలంగా వచ్చే నీళ్లతోటి రెండు పంటలు పండించుకుంటానం. ఆటోమెటిక్ స్టాటర్లు పెట్టుకొని ఇంటికాన్నే కంటినిండ నిద్రపోతానం. అంతమంచిగనే ఉన్నదనుకున్న టైంల వ్యవసాయంపై అవగాహన లేని రేవంత్‌రెడ్డి కరంటు మీద గీ మాటలు మాట్లాడుడేంది. నాడు కరంటుతోటి పడ్డ గోస సాలదా. కరంటు జోలికత్తే గట్టిగ బుద్ధి చెప్తం. మాకు రంది లేకుంట సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటం.
– నాగంపెల్లి కిరణ్, రేలకుంట, నల్లబెల్లి మండలం
నీ ఆటలు సాగయి..
కాంగ్రెసోళ్లకు ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లకు అలవాటుపడిన బుద్ధి యాడబోతది. గిప్పుడు కూడా తెలంగాణ రైతుల కడుపులు గొట్టేందుకు రేవంత్‌రెడ్డి అనే టోడు కుట్ర చేత్తాండు. వ్యవసాయానికి మూడు గంటల కరంటే సాలంటవా.. బిడ్డా ఎక్కడి నుంచి వచ్చినవ్. జర నర్సంపేటకు వచ్చి సూపెట్టు ఎట్ల సరిపోతయో సూత్తం. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని 24 గంటల కరెంటు వచ్చి.. ఇప్పుడిప్పుడే నాల్గు మెతుకులు తింటున్నం. రేవంత్‌రెడ్డీ మా నోట్లో మట్టి కొడుతవా ఏంది?, నీ ఆటలు ఇక్కడ సాగనియ్యం.
– చిన్నాల మల్లేశ్, గొల్లపల్లె, నల్లబెల్లి మండలం
గిట్నే మాట్లాడుతే గట్టిగ బుద్ధి చెప్తం..
నాకు 80 ఏండ్లు. కానీ కేసీఆర్ చేసినంత అభివృద్ధిని ఇంతవరకు ఎప్పుడూ చూడలె. చిన్నతనంలో తాటిపండ్లు తిని బతికినం, కుంచెడు పండించేందుకు అర్వ తిప్పల పడ్డం, కాయకట్టం చేసినం, అయినా నా ఎరుకల చానా ప్రభుత్వాలు మారినయ్. ఏ ఒక్కడు రైతులను పట్టించుకోలే. తెలంగాణ కోసం కొట్లాడి చావు వరకు పోయి వచ్చిన కేసీఆర్ ఒక్కడే రైతుల బాగు కోరిండు. ఏం కావాల్నో అది చేసిండు. 24గంటల కరెంటు ఇత్తున్నడు, పంటలకు నీళ్లు ఇత్తాండు. రైతుకు ఇంకేం కావాలే. నిన్న మొన్న ఎవడో రేవంత్రెడ్డట మూడెకరాలకు మూడు గంటలే కరెంట్ సాలంటున్నాడట కదా. తినే ఇత్తారుల మన్నుబోసేటోడంటే ఇదే. మల్లా గిట్ల మాట్లాడితే బుద్ధి చెబుతం. మా బతుకులు మార్చి మాకు ఆసరాగా ఉన్న కేసీఆర్ సార్‌కు నా దీవెనలు ఎప్పటికీ ఉంటయ్. ఆ దేవుడు సార్‌ను చల్లగా చూత్తడు.
– నందినేని అచ్యుత్‌రావు, రాంపూర్, నల్లబెల్లి మండలం