Medicover Hospitals | న్యూశాయంపేట, ఆగస్టు 13: మెడికవర్ హాస్పిటల్స్ అధునాతన గుండె వైఫల్యంతో బాధపడుతున్న 71 సంవత్సరాల వ్యక్తికి టీఏవీఐ (ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు మెడికవర్ హాస్పిటల్స్చీఫ్ ఆఫ్ కార్డియాలజీ అండ్ డైరెక్టర్, స్ట్రక్చరల్ హార్ట్ అండ్ అడ్వాన్స్డ్ కరోనరీ ఇంటర్వెన్షన్స్ డాక్టర్ కుచులకంటి ప్రమోద్ కుమార్ తెలిపారు.
ఈ ప్రక్రియతో ఆ వ్యక్తికి ఓపెన్-హార్ట్ సర్జరీ అవసరం లేకుండా పోయిందని తెలిపారు. బుధవారం ఆయన హాస్పిటల్లో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన ఈ 71 ఏళ్ల రోగి గత మూడు సంవత్సరాలుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, ఛాతీ నొప్పి సమస్యలతో బాధపడుతున్నారని, వైద్యపరీక్షల అనంతరం ఆయనకు తీవ్రమైన కాల్షిఫిక్ ఏయోర్టిక్ స్టెనోసిస్ (గుండెలోని ప్రధాన కవాటం ఇరుకై, కాల్షియం పేరుకుపోవడం) ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు.
ఆస్పత్రిలో చేరినప్పుడు ఆ రోగికి తీవ్రమైన శ్వాస ఆడకపోవడం, ఛాతి నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతోపాటు కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని, వయసు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని భావించినట్లు తెలిపారు. అందుకే ‘టీఏవీఐ’ ప్రక్రియను ఎంచుకున్నట్లు, ఛాతీని తెరవకుండా, గుండె కండరాలను కోయకుండా స్థానిక మత్తుతో తొడ భాగంలోని ధమని ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు డాక్టర్ ప్రమోద్ కుమార్ వివరించారు.
Heavy Rains | అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సై కీలక ఆదేశాలు
Road Repair | ఆదమరిస్తే అంతే.. సారూ ఈ రోడ్లకు జర మరమ్మతులు చేయించండి
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అవస్థలు