అదే తీరు.. ఆదేశాలు బేఖాతరు!
ఎంజీఎం ఆస్పత్రి వైద్యాధికారుల తీరు మారలేదు. ఎప్పటిలాగే నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మెడికో లీగల్ కేసు (ఎమ్మెల్సీ) ల విషయమై గతంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.
- ఎంజీఎంహెచ్‌లో మారని వైద్యాధికారుల వైఖరి
- ఎమ్మెల్సీ కేసుల చికిత్సలో అదే నిర్లక్ష్యం
- వివరాలు లేకుండానే రిక్విసిషన్ ఫామ్‌ల జారీ
- గతంలో విచారణ జరిపినా ఫలితం శూన్యం
వరంగల్ చౌరస్తా, జూలై 12 : ఎంజీఎం ఆస్పత్రి వైద్యాధికారుల తీరు మారలేదు. ఎప్పటిలాగే నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మెడికో లీగల్ కేసు (ఎమ్మెల్సీ) ల విషయమై గతంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కోర్టు వ్యవహారాలతో ముడిపడి ఉండే ఎమ్మెల్సీ కేసులకు సంబంధించి వైద్యాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అటు రోగులు, ఇటు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రమాదాలు, దాడులు, అనుమానాస్పద ఘటనల్లో క్షతగాత్రులకు చికిత్స అందించే సమయంలో ఇటు పోలీసులు, అటు గాయాల తీవ్రతను కోర్టుకు అందించేందుకు తప్పనిసరిగా కేస్షీట్తో పాటు పరీక్షలు నిర్వహించేందుకు జారీచేసే రిక్విసిషన్పైనా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. బాధితుడికి అయిన గాయాలతో పాటు శరీరంపై ఉన్న పుట్టమచ్చలు, గుర్తింపు చిహ్నాలను కూడా కేస్‌షీట్‌లో పొందుపర్చాలి.
అయితే కనీసం తేదీ, పేరు లేకుండానే వైద్యాధికారులు క్షతగాత్రుడికి ఏయే భాగాల్లో ఎక్స్‌రే తీయాలనే విషయాన్ని నమోదు చేసిన రిక్విసిషన్ను రేడియాలజీ విభాగానికి పంపించారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యంపై ఎంజీఎంహెచ్ వైద్యాధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఎమ్మెల్సీ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చినప్పటికీ వారి తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఇకనైనా అధికారులు స్పందించి ఎమ్మెల్సీ కేసుల విషయంలో జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని రోగులు, అటెండెంట్లతో పాటు పోలీసులు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

