హనుమకొండ, మే 5 : కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీల అమలును విస్మరించిందని మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకా డశ్ ఆరోపించారు. హనుమకొండ హంటర్‌రోడ్డులో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మంగళవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్ఎస్ పోరాడిందని, గతంలో 60 లక్షల మెట్రిక్ టన్నులే పండే ధాన్యం.. కేసీఆర్ హయాంలో 3 లక్షల కోట్ల మెట్రి క్ టన్నులకు చేరిందన్నారు.
కేసీఆర్ రైతులను రాజు చేయాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నా రు. కేసీఆర్ పా లనలో వ్యవసాయం పండుగలా సాగితే.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దండుగలా మారిందన్నారు.రైతులకు కనీ సం గన్నీ సంచులిచ్చే పరిస్థితి లేదన్నారు. రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా కాంగ్రెస్ ప్రభు త్వం రైతు మేళా నిర్వహిస్తున్నద ని ఆరోపించారు. కాంగ్రెస్ స ర్కార్ ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలని ప్రకాశ్ సూచించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, సాంబారి సమ్మారావు, హరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటలను కొ నుగోలు చేయడం లేదు. దీంతో వారు రోజు ల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. పంటల సమయంలో యూరియా కూడా ఇవ్వలేదు. పండిన త ర్వాత ఉత్పత్తులను కొనడం లేదు. మకజొ న్న రైతులు నెల రోజులుగా సెంటర్లలో క్రయవిక్రయాల కోసం ఎదురు చూస్తున్నారు. రైతు సంగ్రామ సదస్సు బుధవారం ఉద యం 9 గంటలకు ప్రారంభమవుతుంది.
– తకళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ
ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన
రైతు సంగ్రామ సదస్సుకు కేటీఆర్ హాజరవుతారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగగా మారింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దండగలా మారింది. కాంగ్రెస్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తోంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతోంది. ప్రజాపాలన అని ప్రతీకార పాలన చేస్తున్నారు. రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మేళాలు ఏర్పాటు చేశారు. మా సదస్సుకు అనేక అవరోధాలు, అడ్డంకులు సృష్టించారు. అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. రైతులకు మద్దతుగా సదస్సు పెడుతుంటే మా కార్యకర్తలు కట్టిన పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు.
– దాస్యం వినయ్‌భాసర్, మాజీ చీఫ్ విప్
సదస్సును విజయవంతంగా నిర్వహిస్తాం
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు తెలిపేందుకు రైతు సంగ్రామ సదస్సును విజయవంతంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్ సర్కార్ పోలీసులను అడ్డుపెట్టుకొని మా నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి చేస్తున్నారు. ఎలాగైనా కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కుట్ర పన్నుతున్నది. ఏది ఏమైనా సదస్సు నిర్వహించి తీరుతాం.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే
ప్రారంభం తప్ప.. పర్యవేక్షణ లేదు
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప పర్యవేక్షణ లేదు. తెలంగాణ రైతుల గోసను ప్రపంచానికి తెలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రైతు రుణమాఫీకి రూ.36,000 కోట్లు అవసరమైతే రూ.18,000 కోట్లు వేసి చేతులు దులుపుకున్నారు. కేసీఆర్ రైతుబంధు వరి నాట్లకు ముందు ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అతీగతీ లేదు. మకజొన్న పంట కొనుగోళ్లు చేపట్టడం లేదు. దమ్ముంటే వరంగల్ మారెట్‌కు రండి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కొనుగోలు సెంటర్లకు వెళ్లారా? రైతు సమ్మేళనాలు కాదు.. రైతు సంక్షేమానికి పాటుపడండి.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి
హామీలు గుర్తు చేసేందుకే సదస్సు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తు చేసేందుకే రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నాం. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం, మోదీ సరార్ పీఎం కిసాన్ పథకంగా అమలు చేస్తున్నారు. కేసీఆర్ పథకాలనే కేంద్రం ఇప్పటికే చాలా పథకాలుగా అమలు చేస్తోంది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ పథకాల అమలు విస్మరించింది.
– వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
అన్యాయాన్ని ప్రజలకు చెబుతాం
కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నది. కాం గ్రెస్ పాలనలో రైతులకు జరిగిన అన్యాయా న్ని ప్రజలకు వివరిస్తాం. తెలంగాణ ప్రజలు ఎదురొంటున్న సమస్యలను పరిషరించడానికి బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. సదస్సుకు వచ్చే రైతుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది.
– పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ