వరంగల్ చౌరస్తా : కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అధికారాన్ని చేపట్టింది. 16 నెలలు కావస్తున్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు మోర్తాల చందర్ రావు, సింగతి సాంబయ్యలు అన్నారు. మే నెల 26, 27,28 తేదీలలో వరంగల్ నగరంలో నిర్వహించనున్న ఎంసీపీఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంసీపీఐ కార్యాలయంలో మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ విధానంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోందని అన్నారు.
ఇలాంటి పరిస్థితులలో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని భావించిన ఎంసీపీఐ పార్టీ పునఃనిర్మాణం చేసి కార్యకర్తలను ప్రజా పోరాటాలకు సిద్ధం చేయడానికి ఈ మహాసభలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో కేంద్ర కమిటీ నాయకులు మాదం తిరుపతి, జిల్లా నాయకులు బలుసుకురినరసయ్య, మాలోతు రాజేష్ నాయక్, బాలగోని రాకేష్, ఇప్ప ఆదినారాయణ, జన్ను ప్రభాకర్, సింగిరెడ్డి సదయ్య తదితరులు పాల్గొన్నారు.