హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 16 : కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎంసీఏ కోర్సుల మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు అక్టోబర్ 17 నుండి 21 వరకు నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ప్రవేశాలు కళాశాల కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు.
2025–26 ఐసెట్ అర్హత పరీక్ష రాయకపోయిన అభ్యర్థులు కూడా ఈ స్పాట్ అడ్మిషన్ కార్యక్రమానికి హాజరై తమ అసలు సర్టిఫికెట్లు సమర్పించి సీట్లు పొందవచ్చని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, కాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఫొటోలు తదితర పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాల కార్యాలయాన్ని లేదా 9182491632 నెంబర్ లో సంప్రదించవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు.