తెలంగాణ ప్రభుత్వం వల్లే ఐనవోలు ఆలయం అభివృద్ధి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. తాను 40 ఏళ్లుగా ఏ మంచి కార్యక్రమాన్నయినా మల్లికార్జునస్వామిని దర్శించుకున్న తర్వాతే మొదలు పెడుతున్నారని చెప్పారు. స్వామివారికి ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే అరూరి రమేశ్, కవితకుమారి దంపతలు, జడ్పీ అధ్యక్షుడు సుధీర్‌కుమార్, మేయర్ సుధారాణి, రాజశేఖర్ దంపతులు, డీసీసీబీ చైర్మన్ మార్నేని, రాష్ట్ర రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్లు వెంకన్న, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు ప్రత్యేక పూజలు చేశారు. ఏసీపీ నరేశ్‌కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకన్న, సీఎఫ్‌వో వీరస్వామి, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఉప సర్పంచ్ సతీశ్‌కుమార్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, పల్లం రవి, నాయకులు పొల్లెపల్లి శంకర్‌రెడ్డి, బుర్ర రాజశేఖర్, రజీని, బోగి సురేశ్, డీఎస్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. నేడు సంక్రాంతి సందర్భంగా ఉత్తరాయణ పుణ్యకాలం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, మాహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, రాత్రి మార్నేని వంశీయుల పెద్దబండి, ఐనవోలు, ఒంటిమామిడిపల్లి, ముల్కలగూడెం, పెరుమాండ్లగూడెం గ్రామాల ప్రభల బండ్ల ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఐనవోలు, జనవరి 14: ఐలోని మల్లికార్జునుడి సన్నిధి భక్తులతో కిటకిటలాడుతున్నది. బోనాలు, శివసత్తుల పూనకాలు, డప్పుల మోతలు.. ఢమరుక నాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా జాన పదుల జాతరగా పేరుగాంచిన ఐలోని బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం విశేష ప్రచారాన్ని కల్పించింది. దీంతో పాటు భారీ ఏర్పాట్లు చేయడంతో భోగి సందర్భంగా శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే స్వామి వారిని దర్శనానికి పోటెత్తారు. మహిళల పూనకాలతో మల్లికార్జునస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి పడమర వైపు ఉన్న ఎల్లమ్మ ఆలయంలో బోనాలు సమర్పించారు. ఎక్కడా ఇబ్బంది కలుగకుండా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు కల్పిస్తున్నారు.