కృష్ణకాలని, నవంబర్ 19 : భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి గనులపై భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. రెండు రోజుల క్రితం ఏరియా వర్షాప్, కేటీకే-5 ఇంక్లెయిన్ గని, కేటీకే ఓసీ- 2, వె య్యి క్వార్టర్స్ ప్రాంతాల్లో దొంగలు పడి పకా ప్రణాళికతో రూ.కోటి విలువ చేసే కాపర్ వైరు, ఇనుప సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం బయటకు వచ్చింది. ఎస్అండ్పీసీ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా చోద్యం చూస్తున్నారు. విషయం వెలుగులోకి రావడంతో అ ప్రమత్తమైన సిబ్బంది అంతర్గతంగా చోరీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కార్మికులు, అధికారులు మాట్లాడుకుంటున్న మాటలు బట్టి ఇంటి దొంగల పనేనని తెలుస్తున్నది.
సంస్థ సొమ్ము చోరీకి గురవుతున్నా అధికారులు ప ట్టించుకోవడం లేదని కార్మికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు గనుల్లో దొం గతనాలు జరుగుతున్నప్పటికీ వారు ప్రేక్షక పా త్ర వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా సింగరేణి సంస్థ స్పందించి వెంటనే చోరీ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్య లు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చోరీ జరిగిన విషయం బయటపడడం తో అప్రమత్తమైన సింగరేణి అధికారులు పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.