బచ్చన్నపేట జూలై 17 : సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యమ కారులు డిమాండ్ చేశారు. 2011 సంవత్సరంలో చేర్యాల మండలం చూంచనకోట గ్రామంలో నాడు జరిగిన రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణ వాణి వినిపించినందుకు నాటి సమైక్య పాలకులు ఉద్యమకారులైన బూర్గు సురేష్ గౌడ్, కోనేటి స్వామి, ముసిని బాబుగౌడ్, బూడిద కిష్టయ్యలపై కేసులో నమోదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేసులు పెట్టి 15 సంవత్సరాలు అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులపై ఉన్న కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.