సుబేదారి, జూన్21 : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ ద్విచక్ర వాహనదారుడిని కాజీపేట ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం కాజీపేట చౌరస్తాలో వాహనాలు తని ఖీ చేస్తుండగా హనుమకొండకు చెందిన అస్లం అనే వ్యక్తి పట్టుబడ్డాడు.
అతడి బైక్పై ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉండగా, మొత్తం రూ. 45,350 చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించారు. దీంతో చలాన్లు మొత్తం చెల్లించేందుకు అతడి బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు.