కాజీపేట, ఏప్రిల్ 14: కాజీపేట రైల్వే జంక్షన్ శివారులోని వడ్డేపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైల్లో నుంచి పడి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. జి ఆర్ పి ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హసన్పర్తి కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున రైలులో నుంచి కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మరణించినట్లు రైల్వే అధికారుల నుంచి సమాచారం వచ్చిందన్నారు.
మృతుడు సుమారు (50) ఏండ్ల వయసు కలిగి, దృఢంగా, తెల్లగా ఉన్నాడని, ఓంటి పై తెల్ల టీ షర్ట్, బ్లాక్ కలర్ లోయర్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతిని వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్ర పరచామన్నారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే 9948348070 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.