బెంగళూరు, ఫిబ్రవరి 21: ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షల లంచం తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు లోకాయుక్తకు చిక్కారు. ఇది కర్ణాటకలోని చించలి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. షిర్హట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమని ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా, గడగ్ లోకాయుక్త పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
బిల్లుల చెల్లింపునకు ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారని విజయ్ పుజర్ అనే కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వల పన్ని లంచం తీసుకుంటుండగా ఎమ్మెల్యేను పట్టుకున్నారు.