రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి శివారులో రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుడిని కొత్త రాయపర్తికి చెందిన సతీశ్ కుమార్‌గా గుర్తించారు. గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడని, అతనికి తల్లిదండ్రులతోపాటు తొమ్మిదేండ్ల కుమార్తె ఉన్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.