Suspension | సుబేదారి (వరంగల్), నవంబర్26 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతికి పాల్పడిన మామునూర్ ఇన్స్ స్పెక్టర్ ఒంటెరు రమేష్తోపాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నెలన్నర క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో కత్తుల రాజును, మరో యువకుడిని మామునూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కత్తుల రాజును రెండు రోజులు పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి లక్ష రూపాయలు లంచం తీసుకొని, గంజాయి కేసులో ఇరికించారు. దీనిపై నమస్తే తెలంగాణ లో ‘నరకం చూపుతున్న ఖాకీ’ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో లక్ష తీసుకొని, యువకుడిని చితకబాది, గంజాయి కేసు ఇరికించి… కథనంపై పోలీసు నిఘా వర్గాలు, డీసీపీ విచారణ చేపట్టి సీపీకి నివేదిక అందజేశారు. ఎట్టకేలకు సీపీ సన్ ప్రీత్ సింగ్ మామునూరు సీఐ రమేష్, సీఐ గన్ మెన్ రఘుపై సస్పెన్షన్ వేటు వేశారు.
Nalgonda City : ‘అందరి హక్కులకు రక్షణ భారత రాజ్యాంగం’
Nalgonda City : ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
Donations | టీటీడీకి రూ.9 కోట్లు విరాళం ..దాతను అభినందించిన చైర్మన్