హనుమకొండ, నవంబర్ 4 : ఎస్సీ రిజర్వేషన్‌ను 15 శాతం నుంచి 20 శాతం పెంచాలని జాతీయ మాలమహానాడు హనుమకొండ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పనికల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల రక్షణ సాధన సభ ఈనెల 25, 26 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్లమెంట్‌కు డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని, కరెన్సీపై డాక్టర్ అంబేద్కర్ చిత్రపటం ముద్రించాలని డిమాండ్ చేశారు.
మాలలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ జీవో 99 రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న దాన్ని పునపరిశీలించాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి వెన్నె రాజు, హనుమకొండ ప్రధాన కార్యదర్శి పడుగుల నర్సయ్య, ఉపాధ్యక్షుడు మల్లం రాజ్‌కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొల్లం రామ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి గొరె రమేశ్, హనుమకొండ యువజన అధ్యక్షుడు గరిగే అనిల్, వరంగల్ యువజన విభాగం అధ్యక్షు ఏడు ఊసిల్ల ఉదయ్, ఐలోని మండల అధ్యక్షుడు అంకూస్ రవికుమార్, గరిగె రాజ్‌కుమార్, జిల్లా నాయకులు సంపతి రఘు, కునమల్ల అనిత, ముప్పిడి శ్రవణ్, నరేష్, మల్లేశ్ పాల్గొన్నారు.