బయ్యారం : బయ్యారం ఏజెన్సీలోని మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీలో ఈ ఏడాది 18 వేల ఎకరాల్లో మక్క పంట సాగు చేస్తుండగా గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలుల కారణంగా సుమారు 1000 ఎకరాల వరకు మొక్కజొన్న పంట నేలకొరిగింది.
ఏజెన్సీలోని అల్లిగూడెం కంబాలపల్లి, నారాయణపురం, గౌరారం, జగత్రావుపేట, వెంకట్రాంపురం, సుద్ధ రేవు, వెంకటాపురం పంచాయతీల పరిధిలోని సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.20 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టి ఈ ఏడాది యూరియా కోరత ఏర్పడినప్పటికి కంటికి రెప్పల పంటను కాపాడుకుంటూ వస్తే చివరి దశలో పంట నష్టం వాటి గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.