పెద్దవంగర, మార్చి07: పోలీస్ స్టేషన్లో మద్యం సేవించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. కానిస్టేబుల్స్‌ను సస్పెండ్(Constables suspended)చేస్తూ మల్టీ జోన్ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజా రామ్, కానిస్టేబుల్ సుధాకర్ బయట వ్యక్తులతో కలిసి పోలీస్ స్టేషన్లోనే మద్యం సేవించారు.
ఇదే విషయంపై నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తపై స్పందించిన పోలీస్ శాఖ విచారణ చేపట్టింది. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
Sobhita-Naga Chaitanya | శోభితాతో హనీమూన్ ట్రిప్‌కి వెళ్లిన నాగ చైతన్య.. ఫొటో వైరల్
Orange Peels | నారింజ పండు తొక్కలతో ఎన్ని లాభాలు కలుగుతాయంటే.. ఆశ్చర్యపోతారు..!
Child marriage | 14 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి.. భర్తతో వెళ్లేందుకు నిరాకరించడంతో