మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడ్డాడు. ఈ విషాదకర సంఘటన కురవి మండలం కాంపల్లీ గ్రామ శివారు పలుగు బొడు తండాలో శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. తాండాకు చెందిన తేజవత్ బాల చందర్ (35) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. బాల చందర్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.