కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన సీఎం కప్ ( CM Cup ) 2026 జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన ముగ్గురు వాలీబాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
(Volley Ball) పోటీలలో కాసిపేట మండలం జట్టు సెమీ ఫైనల్ దశలో ఓడినప్పటికీ, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు క్రీడాకారులు భూక్య సాయి తేజ(సోమగూడెం), దోసందుల రాజేష్(బుగ్గగూడెం), పల్లె రఘువరణ్(బుగ్గగూడెం) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
వీరు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు భూక్య రాజన్న తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంఈవో ముక్తావరపు వెంకటేశ్వర స్వామి, కాంప్లెక్స్ హెచ్ఎం మామిడిపల్లి సాంబమూర్తి అభినందించారు.