నీలగిరి, ఫిబ్రవరి 14 : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 15వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేశ్‌ను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అభినందించారు. విజయం సాధించిన రమేశ్ శనివారం మాజీ ఎమ్మెల్యే కంచర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేశ్‌ను అభినందించి ప్రజా సమస్యలను కార్పొరేషన్లో లెవనెత్తి పరిష్కారించాలని సూచించారు.ఎప్పటికప్పుడు అధికార పార్టీ వైఫల్యాలను కార్పొరేషన్లో ఎండగట్టాలని అందుకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బీపంగి యాదయ్య, మందడి శంకర్‌రెడ్డి, మందడి జితేందర్‌రెడ్డి, మాడ శ్రీనివాస్, కాడుతల అంజయ్య, ఈస్రం రవి, ఉడుతల శంకర్, నెల్లికంటి నాగయ్య, నాగెళి రాములు, జేరిపోతుల వెంకన్న, చిట్టిప్రోలు గిరి పాల్గొన్నారు.