Purushaha | పవన్ కళ్యాణ్ హీరోగా డెబ్యూ ఇస్తున్న మూవీ పురుష (Purushaha). వీరు ఉలవల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ వస్తోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ఫోకస్ తనవైపు తిప్పుకుంటుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి చాటు చాటు లిరికల్ వీడియోసాంగ్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను పాపులర్ సింగర్ చిన్మయి శ్రీ పాద్ పాడింది. హీరోహీరోయిన్ల మధ్య సాగే బ్యూటీ ట్రాక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తుందని విజువల్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి. చిన్మయి శ్రీపాద మ్యాజికల్ వాయిస్ మ్యూజిక్ లవర్స్‌ను మరోసారి ఫిదా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి పాడిన మగాళ్ల మీద జాలిపడేదెవ్వను పాటను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే షేర్ చేసిన పోస్టర్లలో పవన్ కల్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. మొత్తానికి బ్రహ్మచారి భర్తగా మారిన తర్వాత కదనరంగంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో ఫన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చాటు చాటు చాటు నుంచి చూడటాలు దేనికో…
The “Chaatu Chaatu” song from “Purushaha” is a soulful melody that perfectly captures a girl’s yearning to express her feelings to a boy#ChatuChatu from #Purushaha https://t.co/ToOZNZGLld@kalyanb949 @Actor_Rajkumar9 @MeSapthagiri… pic.twitter.com/DKZFMBKj4z— BA Raju’s Team (@baraju_SuperHit) February 14, 2026
Vamsi Nandipaati | ‘హే భగవాన్’ నవ్విస్తూనే హృదయానికి హత్తుకుంటుంది: నిర్మాత వంశీ నందిపాటి