Funky Collections | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాలెంటైన్స్ వీక్ కావడంతో ముఖ్యంగా యూత్ ఆడియన్స్ థియేటర్లకు ఆకర్షితులవుతున్నట్టు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో సుమారు రూ. 1.25 కోట్లు గ్రాస్ వచ్చినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ. 1 కోటి వరకు వసూళ్లు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకుని మరో రూ. 25 లక్షల వరకు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.
అనుదీప్ కేవీ స్టైల్ కామెడీ టైమింగ్, విశ్వక్ సేన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వచ్చే రోజుల్లో నిలకడైన కలెక్షన్లు అత్యవసరం. అయితే నేడు వాలెంటైన్స్ డే, రేపు ఆదివారం సెలవు దినం కావడంతో వీకెండ్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. యంగ్ ఆడియన్స్ నుండి మంచి టాక్ రావడం కూడా సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారుతోంది.
ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ నటించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు. ఇప్పటికే పాటలు సోషల్ మీడియాలో చార్ట్బస్టర్లుగా మారి సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి. మొత్తానికి కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలయికగా వచ్చిన ‘ఫంకీ’కి మొదటి రోజు డీసెంట్ స్టార్ట్ లభించడం చిత్రబృందానికి ఊరటనిచ్చింది. వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.