డీఏ, పీఆర్సీ అందజేయాలి : జి.వెంకట్ రెడ్డి
ప్రభుత్వం పెన్షనర్స్‌కు ఇవ్వాల్సిన 8 డీఏలు, పీఆర్సీతో ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్యంను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్‌రెడ్డి, నల్లగొండ యూనిట్ అధ్యక్షుడు గజవెల్లి సత్యం డిమాండ్ చేశారు.
రామగిరి, ఫిబ్రవరి 14 : ప్రభుత్వం పెన్షనర్స్‌కు ఇవ్వాల్సిన 8 డీఏలు, పీఆర్సీతో ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్యంను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్‌రెడ్డి, నల్లగొండ యూనిట్ అధ్యక్షుడు గజవెల్లి సత్యం డిమాండ్ చేశారు. నల్లగొండలోని పెన్షనర్స్ భవనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తుందని సీఎం వెల్లడించడం హర్షమే కానీ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను సహితం పరిష్కారించాలన్నారు. అనంతరం సామూహిక జన్మదినోత్సవం జరుపుకున్న 30 మంది పెన్షనర్స్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల యూనిట్ నాయకులు యాదవాసుదేవ్, మోహన్‌రావు, ఆంజనేయులు, జి.సుధాకర్, టి.రమేష్, బాలరాజు, సత్తయ్య, ఉమాహేశ్వర్రావు, ఆజీమ్ అలీ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

