IND vs PAK : పొట్టి ప్రపంచకప్‌లో అసలైన సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. కొలంబోలో ఆదివారం రాత్రి 7:30 గంటలకు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఇరుజట్ల సారథులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. శనివారం మీడియా కాన్ఫరెన్స్‌లో పాక్ సారథి సల్మాన్ అఘా ఈ విషయంపై సమాధానం దాటవేశాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సైతం ‘షేక్‌హ్యాండ్ ఉంటుందా?’ అనే ప్రశ్నకు ఇంకా 24 గంటలు సమయం ఉందిగా.. రేపు చూద్దాం అని ఉత్కంఠను పెంచేశాడు.
ప్రపంచకప్‌లో జోరుమీదున్న భారత్, పాకిస్థాన్‌కు కొలంబో మ్యాచ్ చాలా కీలకం. రెండేసీ విజయాలతో సూపర్ 8కు చేరువలో ఉన్న ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. విజయంపై ధీమాతో టీమిండియా ఉండగా.. చరిత్రను మార్చలేమేని, గొప్పగా ఆడేందుకు ప్రయత్నిస్తామని పాక్ సారథి పేర్కొన్నాడు. చిరకాల ప్రత్యర్ధితో మ్యాచ్ సన్నద్దతపై మాట్లాడినా సూర్యకుమార్ యాదవ్ పలు అంశాలు ప్రస్తావించాడు.
1. పాక్ సారథికి హ్యాండ్‌షేక్ ఇస్తారా?
సూర్యకుమార్ యాదవ్ : టాస్ సమయంలో హ్యాండ్‌షేక్ గురించి ఆలోచిస్తాం. మరో 24 గంటలు వేచి ఉండండి.
2. ఓపెనర్ అభిషేక్ శర్మ పాక్‌తో మ్యాచ్‌లో ఆడతాడా?
సూర్యకుమార్ యాదవ్ : అవును.. అభిషేక్ శర్మ కోలుకున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో అతడు తుది జట్టులో ఉంటాడు. పాక్ కెప్టెన్ వ్యాఖ్యలపై స్పందించిన సూర్య.. మేము రేపు అభిషేక్‌ను ఆడించాలని సల్మాన్ కోరుకుంటున్నట్టున్నాడు. అలాగే చేద్దాం అని బదులిచ్చాడు.
SURYAKUMAR YADAV 😂🔥
– Abhishek Sharma will be back to tomorrow…!!!! pic.twitter.com/LkMEe6RRIE
— Johns. (@CricCrazyJohns) February 14, 2026
3. మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్‌ను ఎలా ఎదుర్కొంటారు?
సూర్యకుమార్ యాదవ్ : సిలబస్‌లో లేని ప్రశ్న ఎదురైనా మనం వదిలేయకూడదు. అతడు భిన్నమైన బౌలర్. మేము అతడికి లొంగిపోం. తారీఖ్‌ను ఎదుర్కొనేందుకు మేము ఆతృతగా ఉన్నాం.
4. మీ కాంబినేషన్లు ఏంటీ..?
సూర్యకుమార్ యాదవ్ : కొలంబోలో కుల్దీప్ యాదవ్ ఆడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే అలాగే చేద్దాం. అతడు కచ్చితంగా ఆడతాడు.
Colombo, Sri Lanka: On strategies against Pakistani bowler Usman Tariq, Indian cricket team’s T20 captain Surya Kumar Yadav says, “Sometimes a out of syllabus question comes up in the exam. So we can’t ignore it. To tackle it, you have to try something. You have to adopt your own… pic.twitter.com/q6sDI0R3Uf
— ANI (@ANI) February 14, 2026
5. పాక్‌తో మ్యాచ్ అనగానే ఒత్తిడి అనిపిస్తుందా..?
సూర్యకుమార్ యాదవ్ : పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే కచ్చితంగాఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే.. భారత్ – పాక్ జట్లు తరచూ తలపడవు. అయితే.. మిగతా లీగ్ మ్యాచ్‌ల మాదిరిగానే ఇదొక్ గేమ్. చెప్పాలంటే.. అంత సులవైన మ్యాచ్ మాత్రం కాదు. మేము తరచూ పాక్‌తో ఆడం. కాబట్టి ఒత్తిడి ఉండడం సహజం.
Suryakumar Yadav was spotted helping the Indian batters prepare for Usman Tariq’s unique bowling angle during the practice session 🔥#INDvPAK #T20WorldCup #Colombo #Sportskeeda pic.twitter.com/4reuQjFdrz
— Sportskeeda (@Sportskeeda) February 14, 2026
6. దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేనా..?
సూర్యకుమార్ యాదవ్ : పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల అంశం మా పరిధిలో లేనిది. ఒకవేళ నేను నిర్ణయించే స్థాయిలో ఉన్నప్పుడు మీకు కచ్చితంగా తెలియజేస్తాను.
7. బ్యాటింగ్‌లో తడబాటు, సమస్యలపై ఏమంటారు?
సూర్యకుమార్ యాదవ్ : ప్రంపంచకప్ను మేము కాస్త కష్టంగానే మొదలెట్టాం. వాస్తవాలను ఎవరూ దాచలేరు. స్క్వాడ్‌లోని ప్రతిఒక్కరికి సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన అనుభవముంది. కష్టమైన వికెట్ల మీద ఎలా ఆడాలి? అనే విషయమై బ్యాటర్లకు సొంత ప్రణాళిక ఉంటుంది. మేము గొప్పగా ఆరంభించాం. కానీ, తర్వాత తడబడ్డాం. అయితే.. మళ్లీ పుంజుకున్నాం. టీ20 క్రికెట్లో ఉండే బ్యూటీ ఇదే.
ఐసీసీ ఈవెంట్లలో పాకిస్థాన్‌పై భారత జట్టుదే పైచేయి. నిరుడు ఆసియాకప్‌లో పాక్‌ను లీగ్ దశలో, ఆపై ఫైనల్లో చిత్తు చేసింది టీమిండియా. గత ఐదు టీ20ల్లో చూస్తూ 5-0తో ఇండియా ఆధిపత్యం చెలాయించింది. మొత్తంగా 7-0తో దాయాదిపై తిరుగులేని ఆధిక్యంలో ఉంది భారత్. అయితే.. ఈసారి పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. మిస్టరీ బౌలర్ ఉస్మాన్ తారీఖ్ నుంచే భారత ఆటగాళ్లకు ముప్పు పొంచి ఉంది. చక్లింగ్ యాక్షన్ అర్ధం చేసుకుంటేనే పరుగులు సాధించగలరు. అతడిని ఏమాత్రం అంచనా వేయకుండా ఆడితే వికెట్ సమర్పించుకోవాల్సి వస్తుంది.
2⃣ Games. 2⃣ Wins ✅
Which performance stood out the most for you in the #INDvNAM clash? 🤔#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/MpKQ4PRsW2
— BCCI (@BCCI) February 14, 2026