Heavy Rainfall | వారం రోజులపాటు వానలు.. తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Heavy Rainfall : తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) ఆయా రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది.
Heavy Rainfall : తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) ఆయా రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ అంచనా ప్రకారం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.
వారం రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉండే ఛాన్స్ ఉంది. బంగాళాఖాతో ఈదురుగాలులు, తుపానులు సంభవించే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది. ఉత్తర భారత దేశానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్, లదాక్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 28 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాఖండ్లో కూడా సెప్టెంబర్ 26-28 వరకు ఇదే తరహా పరిస్థితి ఉంటుంది. సెంట్రల్ ఇండియాకు సంబంధించి సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు మధ్యప్రదేశ్, విదర్భలలో వర్షాలు పడుతాయి.
Weather Systems, Forecast and Warnings (Annexure II & III):
Yesterday’s Well-marked Low Pressure area over westcentral & adjoining eastcentral Bay of Bengal intensified into a Depression and lay over Westcentral & adjoining Northwest Bay of Bengal at 1730 hrs IST of today, the… pic.twitter.com/mZnXgaiM5O— India Meteorological Department (@Indiametdept) September 22, 2026
చత్తీస్గఢ్లో సెప్టెంబర్ 28 వరకు కూడా వర్షాలు పడుతాయి. ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోనూ భారీ వర్షాలు పడుతాయి. అనేక చోట్ల గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, మేఘాలయలలో కూడా వానలు పడుతాయి. దక్షిణ భారత దేశానికి సంబంధించి ఏపీ, కేరళ, తెలంగాణ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

