Sheikh Hasina | ఈ డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్‌కు.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం : షేక్ హసీనా
Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి (Former PM) షేక్ హసీనా (Sheikh Hasian) కీలక ప్రకటన చేశారు. 2026 డిసెంబర్ నాటికి తాను తప్పకుండా స్వదేశానికి తిరిగి వెళ్తానని ఆమె స్పష్టంచేశారు. తాను ఎప్పుడు వెళతాననే దానికంటే ఏ విధంగా వెళతాననేదే అత్యంత ప్రధానమని ఆమె వ్యాఖ్యానించారు.
Sheikh Hasina : బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి (Former PM) షేక్ హసీనా (Sheikh Hasian) కీలక ప్రకటన చేశారు. 2026 డిసెంబర్ నాటికి తాను తప్పకుండా స్వదేశానికి తిరిగి వెళ్తానని ఆమె స్పష్టంచేశారు. తాను ఎప్పుడు వెళతాననే దానికంటే ఏ విధంగా వెళతాననేదే అత్యంత ప్రధానమని ఆమె వ్యాఖ్యానించారు. ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ (Special Interview) లో హసీనా ఈ విషయాలను వెల్లడించారు. తన పునరాగమనం శాంతియుత మార్గంలో చట్టబద్ధంగానే ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు.
2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ తనకు మరణశిక్ష విధించడాన్ని హసీనా తీవ్రంగా ఖండించారు. అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అన్యాయమైన తీర్పు అని ఆమె ఆరోపించారు. తన నిష్క్రమణ అనంతరం కొలువుదీరిన ప్రస్తుత ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా, తనపై జరుగుతున్న విచారణను ఒక ప్రహసనంగా ఆమె అభివర్ణించారు. తన రాజకీయ పోరాటంలో భాగంగా జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆమె తేల్చిచెప్పారు.
ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలపై నిషేధం ఎదుర్కొంటున్న తన ‘అవామీ లీగ్’ పార్టీని పునర్నిర్మించడం, పార్టీ శ్రేణులతో సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తానని హసీనా వివరించారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద, తీవ్రవాద శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఇది కేవలం ఆ దేశ అంతర్గత సమస్య మాత్రమే కాదని, ఒక తీవ్రమైన ప్రాంతీయ ముప్పు అని హెచ్చరించారు.
అయితే తన పునరాగమన ప్రణాళికలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కాలేదని ఆమె వెల్లడించారు. ఈ విషయంపై బంగ్లాదేశ్ లేదా భారత ప్రభుత్వాలతో తాను ఇప్పటివరకు ఎలాంటి అధికారిక లేదా అనధికారిక చర్చలు జరపలేదని హసీనా స్పష్టంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

