‘రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తాం’
జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షుడు...
– బీజేపీ నకిరేకల్ పట్టణ అధ్యక్షుడు గర్రె మురళీమోహన్
– రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అరెస్ట్‌పై తీవ్ర నిరసన
నకిరేకల్, సెప్టెంబర్ 22 : జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షుడు గర్రె మురళీమోహన్ తీవ్రంగా ఖండించారు. రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంపై మచ్చ అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, డిండి, ఎస్ఎల్బీసీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిపై స్పందించి, పంటలను కాపాడేందుకు అవసరమైన సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

