తొర్రూరు : తొర్రూరు మండలంలో రాజకీయ వేడి పెరుగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కంటయపాలెం గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని మాజీ జెడ్పీటీసీ, జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ఆరు గ్యారంటీల(Six guarantees) ముసుగులో ప్రజలను మోసం చేసింది.
అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇతర పార్టీల వాగ్దానాలు చూసి మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ సమావేశంలో తోర్రూర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ ఈనెపల్లి శ్రీను, గ్రామ పార్టీ ఇన్చార్జ్ మహంకాళి భూపతి, మండల పార్టీ ఉపాధ్యక్షులు మొగిలి మల్లేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గోసంగి భాస్కర్, మాజీ సర్పంచ్ పల్లె సర్వయ్య, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆవుల ఉపేందర్, లక్కిడి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పల్లె యాకన్న, డాక్టర్ రాగి జగదీశ్వర్, సంధిరి రామచంద్రు, నిమ్మల ముతయ్య, పోతార్ల కృష్ణ, మాచర్ల ఏకాంబరం, ఇమాన్ సాబ్, ఎస్.కే. మైబెల్లి, ఎస్.కే. జానీ, ఆవుల చేరాలు, పేరబోయిన ప్రభాకర్, గోనె శ్రీను, గుండ ప్రభాకర్, మధుగాని కుమార్, సిరిపాటి శ్రీను, సిరిపాటి ముఖేష్, బొమ్మర వినోద్, బాల్య ప్రశాంత్, బానోత్ భాస్కర్, బానోత్ కోటి, బొల్లికొండ నాగరాజు, పల్లె నరేందర్, దేశ బోయిన ప్రదీప్, గడ్డం రామ్మూర్తి, వెలిశాల సుధాకర్, కావటి కుమార్, మచ్చ మురళి, మచ్చ సంపత్, బొల్లికొండ సంపత్, సలీం, గడ్డం సృష్టి, తోర్రూర్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు యర్రం రాజు తదితరులు పాల్గొన్నారు.