తరుణ్‌భాస్కర్ కథానాయకుడిగా కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘నవ్వకండి! ఇది చాలా సీరియస్ మ్యాటర్!’ అనేది ఉపశీర్షిక. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. పవన్ సాదినేని సమర్పణలో కల్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. దాంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా శుక్రవారం హీరో ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. క్రైమ్, హాస్యం, పొలిటికల్ సెటైర్ కలగలిసిన ఎంటర్టైనర్ ఇదని, కథ, హీరో పాత్రను ప్రతిబింబించేలా ఈ పోస్టర్ డిజైన్ చేశామని, ఈ నెల 9న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు. విష్ణు ఓయి, హర్షవర్దన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: సూర్యప్రకాష్ జ్యోసుల, కెమెరా: విద్యాసాగర్ చింత, సంగీతం: స్వీకర్ అగస్తీ, నిర్మాణం: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్డూడియోస్.