సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ ఉపశీర్షిక. మహేష్‌చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ముగ్గురు అమ్మాయిల కథలా అనిపించే ముగ్గురు తండ్రుల వ్యథ ఇది.
నేటి ఇంటర్నెట్ తరం తెలుసుకోవాల్సిన అసలైన కథ. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, జీవితాల్ని చూస్తున్నట్లే ఉంటుంది. సెంటిమెంట్‌తో పాటు చక్కవి వినోదంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. పృథ్వీరాజ్, కేదార్‌శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్, సంగీతం: జీసీ క్రిష్, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎమ్ మురళీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌చంద్ర.