ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మా వందే’. ప్రధాని మోదీగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్న ఈ చిత్రానికి క్రాంతికుమార్ సీహెచ్ దర్శకుడు. వీర్రెడ్డి.ఎం నిర్మాత. పోరాటం కన్నా కన్నతల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ మోదీ జీవితంలోని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నది. ఈ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్ట్స్ షెడ్యూల్ కోసం కాశ్మీర్ వెళ్లనున్నట్టు మేకర్స్ తెలిపారు.
400కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని, ప్రపంచంలోనే తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్‌తో చిత్రీకరణ జరుపుతున్నామని, హాలీవుడ్ హీరో జేసన్ మమొవాను ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ తెలిపారు. రవీనా టాండన్, జగపతిబాబు, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణం: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్.