నర్సింహులపేట, జూన్ 17: ఆకేరువాగు నుంచి అనుమతి లేకుండా రాత్రి, పగలు వందలాది ట్రాక్టర్లు నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలంతా వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి, రాత్రి నిద్రలేకుండా గడపాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను జయపురం గ్రామంలో ప్రజలు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రోడ్డుపై వెళ్లకుండా కాళీ ట్రాక్టర్లను అడ్డుపెట్టారు.
దీంతో రాత్రంతా ఆగిన ఇసుక ట్రాక్టర్లు సోమవారం మళ్లీ మొదలు కావడంతో బక్కతండా రైతులు అడ్డుకున్నారు. రైతులే ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు. అక్రమ ఇసుక ట్రాక్టర్లకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.