హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)లో ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు మూడు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్టర్ పోస్టులు రెండింటికి ఐవీఆర్ఐ దరఖాస్తులు ఆహ్వానించింది. రిజర్వేషన్ క్యాటగిరీ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని తెలిపింది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాలని, మార్చి 16న ఇంటర్వ్యూ పద్ధతిలో నియామకం చేపట్టనున్నట్టు ఎన్వీఆర్ఐ అధికారులు తెలిపారు. వివరాలకు www.ivri.nic.in వెబ్సైట్ సంప్రదించాలని సూచించారు.