(Driver Dead) మహబూబాబాద్: విధులకు వచ్చిన ఓ ఆర్టీసీ డిపో డ్రైవర్ కన్నుమూసిన విషాద సంఘటన మహబూబాబాద్‌లో జరిగింది. మృతుడు డ్రైవర్ జనార్థన్. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విధులకు వచ్చి కన్నుమూయడం పట్ల తోటి ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జనార్ధన్ ఆదివారం ఉదయం డ్యూటీ చేసేందుకు డిపోకు వచ్చి రిపోర్ట్ చేశారు. కొంతసేపటికే కండ్లు తిరిగినట్లు అనిపిస్తున్నదంటూ అక్కడే ఉన్న తోటి ఉద్యోగులకు చెప్తూనే గుండెపోటుకు గురయ్యాడు. దాంతో తోటి ఉద్యోగులు ఆయనను దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ డ్రైవర్ జనార్ధన్ కన్నుమూశారు. గత 20 సంవత్సరాలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న జనార్థన్ అకాల మృత్యువుకు గురవడంతో తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నిత్యం నవ్వుతూ, నవ్విస్తూ ఉండే తోటి డ్రైవర్ చనిపోయాడని తెలుసుకుని మిగతా ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. అందరితో మర్యాదగా ఉండే జనార్ధన్ మరణం అందరినీ కంటతడి పెట్టించింది. జనార్ధన్ స్వగ్రామం మరిపెడ మడలం తానాంచర్ల. జనార్ధన్ మృతికి డిపో కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. డిపో మేనేజర్ యూ రాజ్యలక్ష్మి, ఎస్టీఐ అజీముద్దున్. టీ పాపిరెడ్డి ,బీ నాగేశ్వరరావు,బీ రవీందర్ రెడ్డి, ఖలీల్,పీ సమ్మయ్యతో పాటు పలువురు కార్మికులు, నాయకులు దవాఖానకు వెళ్లి నివాళులర్పించారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..