గణపురం, జాన్ 24 : భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి కేసులో బుధవారం అధికారులు సీన్ రీ కన్న్ట్రక్షన్ చేశా రు. ఈ నెల 22న ఉదయం భూపాలపల్లి ఆర్టీవో ఆఫీస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డీటీవో మృతి చెందగా రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్‌ను విచారణ అధికారిగా నియమించింది. దీంతో ఆయన భూపాలపల్లికి వచ్చి విసృ్తతస్థాయిలో విచారణ చేపట్టారు. ఆయన తొలుత గణపురం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు.
ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు సేకరించిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై అశోక్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, లారీ యజమానితో పాటు హార్వెస్టర్ డ్రైవర్‌ను విడివిడిగా విచారించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత జెన్కో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రమాద సమయంలో లారీలో ఉ న్న బొగ్గు లోడింగ్ వివరాలపై ఆరా తీశారు. అక్కడి నుంచి నేరుగా ఘ టనా స్థలానికి చేరుకుని, నలుగురు ప్రత్యక్ష సాక్షులను విచారించారు.
ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో అకడ సీన్ రీ కన్న్ట్రక్షన్ చేసి పరిస్థితులను క్షుణ్ణంగా విశ్లేషించారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అకడి నుంచి బొగ్గు లోడింగ్ పాయింట్ తాడిచర్లకు వెళ్లిన విచారణ అధికారి, ఓపెన్ కాస్ట్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రమాదానికి గురైన లారీ ఆ రోజు రవాణా చేసిన బొగ్గు లోడ్ రికార్డులు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా, ప్రమాదానికి పూర్తి కారణాలు, సేకరించిన ఆధారాలతో కూడిన ప్రాథమిక నివేదికను ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు సమాచారం. ఈ విచారణలో ఎంవీఐలు జంగ్లీ శ్రీనివాస్, శివపల్లి శ్రీనివాస్, బారగాడి శ్రీనివాస్, ఏఎంవీఐలు ఫాహిమా సుల్తానా, సుందర్ లాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.