నర్సింహులపేట, ఆగస్టు 3: ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు గంటలకు కొద్దిగా కట్ (Power Cuts) చేస్తుండంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి వర్షానికి నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో ఉదయం 8 గంటలనుండి 12 గంటల వరకు కరెంటు లేకపోవడంతో పేషంట్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన తాళ్ల కలమ్మ అనే మహిళ బైపాస్ సర్జరీ కావడంతో ఇంట్లో నుండి బయటకు రాని పరిస్థితి. దీనికి తోడు ఆక్సిజన్ అందక పోవడంతో బ్రీతింగ్ పెట్టాల్సి ఉంది. గంటలకు గంటలు కరెంటు పోవడంతో ఆ మహిళను ఇంట్లో నుంచి బయటకు తీసి గాలి అందించేందుకు ఆమె మనవరాలు తువాలతో గాలి విసరాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా వర్షం లేక ఉక్క పొతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి కరెంట్ కోతలు కాకుండా చూడాలని రైతులు ప్రజలు కోరుతున్నారు.