కురవి, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి జాతర నిర్వహణ పై పట్టింపు లేదని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(MLC Satyavathi )అన్నారు. బుధవారం స్వామి,అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ వీరభద్ర స్వామి ఎంతో మహిమాన్వితుడని అన్నారు. రాష్ట్ర ప్రజలు, నా రాజకీయ గురువు (కేసీఆర్) సుఖ సంతోషాలతో ఉండాలని వీరభద్ర స్వామిని మనసారా మొక్కుకున్నట్లు తెలిపారు.
పూర్వం నుండి ఈ జాతర నిర్వహించడం జరుగుతుందని కానీ ఎప్పుడు ఇంత అలసత్వం లేదన్నారు. నిర్వహణపై ముందు చూపు లేక పట్టు తప్పారని విమర్శించారు. సాధారణ భక్తులను పలకరిస్తే వారు చెప్పే బాధలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. ఉదయం పూటనే నిర్వహణ ఇలా ఉంటే, మరో 24 గంటల పాటు భక్తుల రద్దీ పెరుగుతుందని ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మరింత ఇబ్బందులు పడతారన్నారు.
ఆలయ ఈవో, అధికారులతో భక్తుల ఇబ్బందులపై సూచనలు చేసినట్లు వివరించారు. ఎమ్మెల్సీ వెంట మాజీ జడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, బీఆర్ఎస్ నాయకులు తోట లాలయ్య, ఐలి నరహరి, గుగులోతు రవి, రాజు నాయక్, నాగయ్య, బోడ శ్రీను, గుగులోతు నెహ్రూ, అల్లూరి కిషోర్ వర్మ, ప్యాట్నీ, జీవన్, బుజ్జి, బాదె నాగయ్య, తదితరులు ఉన్నారు.