మహబూబాబాద్ : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు పెద్ద ఎత్తున ఆసరా పెన్షన్లు అందుతున్నాయని, ఇది సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప సాహసం దాతృత్వం కూడిన నిర్ణయమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
మహబూబాబాద్ పట్టణంలోని లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 లక్షల మంది అభాగ్యులైన వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
పింఛన్ రానివారు అధైర్యపడవద్దని అర్హులందరికి ఆసరా పెన్షన్స్ వస్తాయన్నారు. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, ఏఎంసీ వైస్ చైర్మన్ సుదగాని మురళి, చిట్యాల జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.